దర్శి: తాళ్లూరు మండలం విఠలాపురం గ్రామంలో శిథిల వ్యవస్థకు చేరుకున్న నీటి ట్యాంక్, కొత్త ట్యాంకు నిర్మించాలని కోరుతున్న ప్రజలు
Darsi, Prakasam | May 17, 2026 ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలంలోని విఠలాపురం గ్రామంలో నీటి ట్యాంకర్ శిధిలా వ్యవస్థకు చేరుకోవడమే కాకుండా నీరు మురి కూపంగా మారిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి ట్యాంక్ నుంచి వచ్చే నీటిని వాడుకోలేక అవస్థలు పడుతున్నామని అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామానికి కొత్త నీటి ట్యాంకు నిర్మించి సమస్య పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.