గిద్దలూరు: కొమరోలు మండలం గోపాలుని పల్లి గ్రామంలో ఘనంగా పోలేరమ్మ తిరుణాల, ఆకట్టుకున్న దేవత మూర్తుల నృత్యాలు
మార్కాపురం జిల్లా కొమరోలు మండలం గోపాలుని పల్లి గ్రామంలో పోలేరమ్మ తిరుణాల మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయంలో మూడు రోజులపాటు ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ విశేషంగా ఆకర్షించాయి. దేవత మూర్తుల నృత్యాలు అందర్నీ కట్టిపడేస్తాయి. ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశాడు.