రాయదుర్గం: అశ్వ వాహనంపై ఊరేగిన ప్రసన్న వెంకటరమణుడు
రాయదుర్గం పట్టణంలో ప్రసిద్ధ శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలు 9 వ రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి అశ్వ వాహనోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారిని సుందరంగా అలంకరించిన అశ్వ వాహనంపై కొలువుదీర్చి ఊరేగింపు నిర్వహించారు. కోట ఏరియాలోని ఆలయం నుండి ఊరువాకాలి, తేరు బజార్, లక్ష్మీబజార్ మీదుగా ఊరేగింపు సాగింది. అడుగడుగునా శ్రీవారిని భక్తులు దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఈఓ నరసింహరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గౌని ఉపేంద్రారెడ్డి, మురళీ మోహన్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, బీసా శ్రీనివాసులు పాల్గొన్నారు.