యర్రగొండపాలెం: ఇచ్చిన గడువులోపు వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులు పూర్తి చేయాలని హెచ్చరించిన సీఎం చంద్రబాబు
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు సమీపంలోని వెలుగొండ ప్రాజెక్టు పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. గంటవాని పల్లి సమీపంలో ఉన్న ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించారు. పనులను ప్రారంభించి ఎన్ని రోజులు అవుతుంది ఎప్పుడు పూర్తి చేస్తారని సీఎం వారిని అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన గడువులోపు పూర్తి చేయాలని వారిని హెచ్చరించారు. సీఎంతో పాటు మంత్రి రామానాయుడు ఉన్నారు