యర్రగొండపాలెం: వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామమైన కలనూతల నిర్వాసితుడికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిధులు వచ్చినట్లు వెల్లడి
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం కలనూతల గ్రామానికి చెందిన వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుడు బ్రహ్మయ్య తన ఖాతాలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ 12 లక్షల 50 వేల రూపాయలు జమ అయ్యాయని పేర్కొన్నారు. అంతేకాకుండా తన కుటుంబ సభ్యులకు కూడా పరిహారం జమ అయినట్లు తెలిపారు. 30 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కలను నెరవేర్చిన మహానుభావుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది