యర్రగొండపాలెం: వీరభద్రపురం టిడిపి సీనియర్ నాయకులు ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరిక
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం వైసిపి కార్యాలయంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ సమక్షంలో వీరభద్రపురం గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకుడు శ్రీను కొంతమంది స్థానికులతో కలిసి వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే నాయకత్వంపై ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారి తెలిపారు. దీంతో పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కోలాహలంగా మారింది.