మార్కాపురం: చెన్నకేశవస్వామి కోనేరును పరిరక్షించాలని బిజెపి నాయకులు అధికారులకు విజ్ఞప్తి
మార్కాపురంలో వెలిసిన లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయానికి చెందిన కోనేరును బిజెపి నాయకులు పరిశీలించారు. కోనేరు చెత్తాచెదారం వ్యర్ధాలతో నిండి ఉంది. అంతేకాకుండా కోనేరు మెట్ల పైన చిన్న చిన్న మొక్కలు పెరిగి నిరుపయోగంగా మారింది. పవిత్రమైన కోనేరులో చెత్తాచెదారం తొలగించాలని అధికారులకు తెలియజేయడంతో తగిన చర్యలు తీసుకున్నారు. అవసరమైనప్పుడే కాకుండా మిగిలిన సమయాల్లో కూడా కోనేరును పరిరక్షించాలని దేవాదాయ, మున్సిపల్ శాఖల అధికారులను కోరారు.