కొండపి: జరుగుమల్లి మండలం బిట్రగుంట గ్రామ సమీపంలోని 16 నెంబర్ జాతీయ రహదారిపై ఆటో దిచక్ర వాహనం ఢీకొని ఒకరికి గాయాలు
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం బిట్రగుంట గ్రామ సమీపంలో 16వ నెంబర్ జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం టైరు పంచర్ కావడంతో ఆటోని ఢీ కొట్టింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు కావడంతో హైవే అంబులెన్స్ లో పోలీసులు ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆటలో ఉన్న ప్రయాణికులు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.