జడ్చర్ల: జడ్చర్ల పట్టణంలో యూరియా కొరతతో రైతులు ఆందోళన
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో యూరియా కొరతతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం మార్కెట్ యార్డ్ కమాన్ వద్ద యూరియా దొరకకపోవడంతో, నేతాజీ చౌరస్తాలో రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. పంటలు కీలక దశలో ఉన్నాయని, ప్రభుత్వం యూరియా సరఫరా చేయడంలో విఫలమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు