జడ్చర్ల: మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
జడ్చర్ల నియోజకవర్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో 167 హైవేపై చిల్వర్ గ్రామానికి చెందిన రాములు తన బైక్పై వెళ్తూ ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రాములు అక్కడికక్కడే మరణించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.