జడ్చర్ల: నవాబు పేట మండల కేంద్రంలోయూరియా కోసం రైతుల పడిగాపులు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబు పేట మండల కేంద్రంలో సోమవారం ఉదయం నుంచి రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. యూరియా వచ్చిందన్న సమాచారంతో పెద్ద ఎత్తున రైతులు, మహిళలు, వృద్ధులు కేంద్రానికి చేరుకున్నారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని వారు కోరుతున్నారు.