జడ్చర్ల: బాలానగర్ మండల కేంద్రంలోని అలుగు పారుతున్న చిన్న చెరువు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలోని చిన్న చెరువు ఆదివారం అలుగు పారింది. 15 రోజులుగా వర్షాలు లేక పంటలు ఎండిపోయే దశలో ఉండగా, రాత్రి ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షం వల్ల చెరువులోకి వరద నీరు చేరి అలుగు ఉద్ధృతి పెరిగింది. ఈ వర్షంతో వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు మేలు జరుగుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు.