కొండపి: కొండపిలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం, విద్యుత్ సరఫరాకు అంతరాయం
ప్రకాశం జిల్లా కొండపి మండలంలో బుధవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులు వల్ల కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మధ్యాహ్నం వరకు తీవ్ర ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు ఉపశమనం కలిగింది. వాతావరణ శాఖ కూడా మూడు రోజులపాటు ప్రకాశం జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములు మెరుపులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసాయి.