రాయదుర్గం: మండ వ్యవసాయ అధికారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా
విధుల్లో అలసత్వం వహిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న డి.హిరేహాల్ మండల వ్యవసాయ శాఖ అధికారి కృష్ణ కిషోర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి ఎన్.లోకేష్ డిమాండ్ చేశారు. మంగళవారం రైతులతో కలిసి మండల వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు అరగంట పాటు ధర్నా చేపట్టారు. 20 రోజులుగా డబ్బులు చెల్లించినా మండల కేంద్ర రైతులకు ఒక్క బస్తా విత్తన వేరుశనగ విత్తనాలు కూడా పంపిణీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారి విధులకు సరిగా హాజరు కాక, రైతులకు సమాచారం ఇవ్వకుండా కార్యాలయాన్ని మూసివేస్తున్నారని మండిపడ్డారు. ఖరీఫ్ సీజన్‌లో రైతులు నష్టపోతున్నారని తెలిపారు.