రాయదుర్గం: పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఘనంగా ఎంప్లాయిస్ యూనియన్ 75 వ వార్షికోత్సవ వేడుకలు
రాయదుర్గం డిపో వద్ద ఎంప్లాయిస్ యూనియన్ 75వ వార్షికోత్సవ సంబరాలు శనివారం ఘనంగా జరిగాయి. శ్రీరాములు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. రామాంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరణ చేశారు. యూనియన్ సాధించిన విజయాలను ఉద్యోగులకు వివరించారు. డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ _ఎస్.ఎస్. వలి_, డిపో ప్రెసిడెంట్ టి.ఎస్.కె. జిలాన్, కార్యదర్శి రామలింగ, అసిస్టెంట్ సెక్రటరీ అరుణ్ కుమార్, ట్రెజరర్ కె.టి. రెడ్డితో పాటు జోనల్, రీజినల్ కమిటీ సభ్యులు, అధికారులు, మహిళా నాయకురాలు కృష్ణవేణి_, అధిక సంఖ్యలో యూనియన్ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.