గిద్దలూరు: గిద్దలూరులో పెట్రోల్ డీజిల్ ధరలపై మీడియాతో మాట్లాడిన వైసీపీ ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి
దేశంలోనే మన రాష్ట్రంలోని ఎందుకు ఎక్కువగా పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నాయని మార్కాపురం జిల్లా గిద్దలూరు వైసిపి ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పిన కూటమి నాయకులు మిగతా రాష్ట్రాల కన్నా ఎక్కువ ధరలకు విక్రయించడాన్ని ప్రశ్నించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు.