గిద్దలూరు: పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై వైసీపీ ఇన్చార్జ్ నాగార్జున రెడ్డి గిద్దలూరులో నిరసన కార్యక్రమం
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని మేనిఫెస్టోలో పేర్కొని దేశంలో ఎక్కడలేని విధంగా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంపై మార్కాపురం జిల్లా గిద్దలూరు వైసిపి ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి కార్యకర్తలతో కలిసి గిద్దలూరు పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టిన నాగార్జున రెడ్డి.. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని గిద్దలూరు తహసిల్దార్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. అన్ని రాష్ట్రాలలో 109 రూపాయల లోపే ఉన్న డీజిల్, పెట్రోల్ ధరలు ఎక్కడని విధంగా ఆంధ్రాలో 113 రూపాయలు ఉండడాన్ని నాగార్జున రెడ్డి తప్పుపట్టారు.