నంద్యాల అర్బన్: బియ్యం ధరలను నియంత్రణకు ప్రత్యేక చర్యలు: జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్
Nandyal Urban, Nandyal | Nov 13, 2026
జిల్లాలో బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్ ఆదేశించారు. రైస్ మిల్లర్లు, హోల్సేల్, రిటైల్ వ్యాపారులతో నిర్వహించిన సమావేశంలో బియ్యం రకాల వారీగా ధరలను ప్రకటించారు. నిర్ణీత ధరలకు మించి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.