మార్కాపురం: జిల్లా కేంద్రంలోని మున్సిపల్ మరుగుదొడ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం ఆర్ అండ్ బి ఎదురుగా ఉన్న మునిసిపల్ మరుగుదొడ్లను జిల్లా కలెక్టర్ విజయ సునీత తనిఖీ చేశారు. మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉన్నాయా లేవా అని స్వయంగా పరిశీలించారు. ప్రతిరోజు క్లీన్ చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని హెచ్చరించారు. మరుగుదొడ్ల ప్రాంతంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు