దర్శి: దర్శి లో శిథిలావస్థకు చేరిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ తో స్థానికుల ఆందోళన
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని చౌటపాలెం రోడ్డులో ఉన్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకోవడంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ట్యాంక్ పిల్లర్లు పగుళ్లు రావడంతో కింద పడిపోతుందేమోనని భయపడుతున్నారు. 40 సంవత్సరాల క్రితం నిర్మించిన ట్యాంకి శిథిలావస్థకు చేరుకుంది. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.