మార్కాపురం: స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ మార్కాపురం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఎన్ఎస్ నగర్ లో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ మార్కాపురం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్ విజయ సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా బల్క్ వేస్ట్ జనరేటర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పరిశుభ్రం చేసే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించారు. చెత్తాచెదారాన్ని తొలగించి అందంగా ముగ్గులు వేశారు. కొండేపల్లి రోడ్డు లోని సప్లై ఛానల్ వద్ద ప్రత్యేక శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ప్రజా మరుగుదొడ్ల వద్ద క్లీనింగ్ అండ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ చేతుల మీదుగా మొక్కలు నాటించారు.