కొండపి: కొండపిలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా చెత్త సేకరించి రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా కొండపి ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో శుక్రవారం స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా చెత్త సేకరించే రిక్షాలను మంతి స్వామి ప్రారంభించి పంపిణీ చేశారు. అలానే తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ప్రజలు అందించాలని డస్ట్ బిన్నులు కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పరిసరాల పరిశుభ్రత వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. ప్రజలు కూడా తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసే అందించడం వల్ల సంపద సృష్టించవచ్చని అన్నారు.