దర్శి: గంగన్న పాలెం లో ప్రేమగా పెంచుకున్న ఎద్దు మృతి చెందడంతో విషాదంలో యజమాని
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం గంగన్న పాలెం లో విషాదం చోటు చేసుకుంది. ఉమా రెడ్డి వెంకటేశ్వర రెడ్డి ఎంతో ప్రేమగా పెంచుకున్న అగ్ని అనే పందెపు ఎద్దు అనారోగ్యంతో మృతి చెందింది. ఇతర ప్రాంతాల వారు 70 లక్షల వరకు ఆఫర్ చేశారని తనకు గుర్తింపు తెచ్చిన ఎద్దును అమ్మ బోనని ఆయన గతంలో చెప్పినట్లుగా తెలిపారు. 100కు పైగా పోటీల్లో పాల్గొని అనేక విజయాలు సాధించిందన్నారు.