గిద్దలూరు: గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో మహిళా దొంగలు హల్చల్, ఓ దుకాణంలో నీటి మోటర్ ని ఎత్తుకు వెళ్ళిన దొంగలు
మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో మహిళా దొంగలు హల్చల్ చేశారు. మంగళవారం తెల్లవారు జామున రోషన్ రిఫ్రిజిరేటర్, ఏసీ వర్క్స్ దుకాణంలో నీటి మోటర్ ని దొంగలించి తీసుకువెళ్లారు. ఇద్దరు మహిళలు నీటి మోటర్ ని చోరీ చేస్తున్న దృశ్యాలు స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దొంగిలించిన మోటార్ విలువ రూ.15,000 వేలు ఉంటుందని దుకాణ యజమాని తెలిపాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు చోరీ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.