గిద్దలూరు: గిద్దలూరు పాతల నాగేశ్వర స్వామి దేవస్థానంలో నేలకొరిగిన రావి, వేపచెట్టు.. అశుభంగా భావిస్తున్న భక్తులు
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పాతాళ నాగేశ్వరరావు స్వామి దేవస్థానం ప్రాంగణంలోని భారీ వృక్షలు నేలకొరిగాయి. 120 సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న రావి, వేపచెట్టు ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలియాయి. సంఘటన చోటు చేసుకున్న సమయంలో భక్తులో ఎవరు అక్కడ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పినట్లుగా భక్తులు తెలిపారు. 120 సంవత్సరాల క్రితం రావిచెట్టు, వేప చెట్టు ఆలయ ప్రాంగణంలో పెన వేసుకుని పుట్టాయి. అప్పటినుంచి శివపార్వతులు వల్లే భావించి భక్తులు పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. అకస్మాత్తుగా భారీ వృక్షం నేలకొరకడంతో ప్రజలు ఆశుభం గా భావిస్తున్నారు.