దర్శి: ముండ్లమూరు మండలంలోని మారెళ్ళ గ్రామంలో అంకాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని మారెళ్ళ గ్రామంలో వెలసిన అంకాలమ్మ తల్లి దేవస్థానంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆషాడ మాసం సందర్భంగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారి ఆలయంలో పొంగల్లు తయారు చేసుకొని నైవేద్యంగా సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చుట్టుపక్కల భక్తులతో సందడి వాతావరణం నెలకొన్నది.