తాడిపత్రి: కొట్టాలపల్లి సమీపంలో జొన్న ఇగురు తిని 35 గొర్రెలు మృతి, విచారణ చేపట్టిన పశువైద్యాధికారి రమేష్ బాబు
పెద్దవడుగూరు మండలం కొట్టాలపల్లి గ్రామ సమీపంలో ఓ పొలంలో జొన్న ఇగురు తిని 35 గొర్రెలు మృతి చెందాయి. చిత్రచేడు గ్రామానికి చెందిన రామాంజనేయులు, పుల్లన్న, గణేష్, నాగార్జున లకు చెందిన గొర్రెల మందను కొట్టాలపల్లి వద్ద మేతకు వదిలారు. అక్కడ జొన్న ఇగురు తిన్నాయి. తర్వాత కాలువలో నీళ్లు తాగాయి. దీంతో 35 గొర్రెలు మృతి పడ్డాయి. ఈ ఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పశువైద్యాధికారి రమేష్ బాబు గురువారం ఈ ఘటనపై విచారణ చేపట్టారు.