యర్రగొండపాలెం: దోర్నాల మండల కేంద్రంలోని ఎస్టీ హాస్టల్ గురుకులంలో మెనూ పాటించడం లేదని విద్యార్థుల ఆవేదన
మార్కాపురం జిల్లా దోర్నాల మండల కేంద్రంలోని ఎస్టి హాస్టల్ గురుకులంలో 65 మంది విద్యార్థులు ఉన్నారు. హాస్టల్ మెనూలో లేని ఎగ్ కర్రీ పెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పాఠశాలలో ప్రారంభమైనప్పటి నుండి మెనూ ప్రకారం భోజన సదుపాయానికి నోచుకోలేదని అసలు చికెన్ పెట్టడం లేదని విద్యార్థులు అన్నారు. పైగా ప్రతిరోజు ఇవ్వాల్సిన అరటిపండు మజ్జిగ ఇవ్వడం లేదని విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేశారు.