రాయదుర్గం: బళ్ళారి - గుండ్లపల్లి ప్రధాన రహదారిపై ట్రాక్టర్ ను ఢీకొన్న టిప్పర్, ఒకరి పరిస్థితి విషమం
బొమ్మనహాల్ మండలం శ్రీనివాస క్యాంప్ సమీపంలో బళ్ళారి - గుండ్లపల్లి ప్రధాన రహదారిపై ట్రాక్టర్ ను టిప్పర్ ఢీకొట్టింది. ఉద్ధేహాల్ వైపు వెళ్తున్న ట్రాక్టర్ ను వెనుక వైపునుంచి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో ట్రాక్టర్ డ్రైవర్ కుళాయిస్వామి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు బళ్లారి విమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు.