రాయదుర్గం: మల్లాపురం గ్రామంలో పాముకాటుకు గురై మహిళ కూలి మృతి
రాయదుర్గం మండలంలోని మల్లాపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నిరుపేద కూలీ బోయ చిట్టెమ్మ (38) ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాముకాటుకు గురైంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు బళ్లారి విమ్స్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున చిట్టెమ్మ మృతి చెందింది. కుటుంబానికి ఆమె ఆధారంగా ఉండేది. ఆమె మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.