విశాఖపట్నం: గాజువాక: రైల్వే బ్రిడ్జి కింద నిలిచిన నీటిని తొలగించిన అధికారులు
విశాఖ గాజువాక దుర్గా నగర్ రైల్వే బ్రిడ్జి కింద నిలిచిన వర్షపు నీటిని స్టీల్ ప్లాంట్ సిఐ కేశవరావు ఆధ్వర్యంలో జేసీబీతో దారి మళ్లించారు. దీంతో వాహనదారులకు రాకపోకల ఇబ్బందులు తప్పాయి. ప్రజా సమస్యపై వేగంగా స్పందించిన పోలీసుల పనితీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.