మార్కాపురం: ఎస్సీ కమ్యూనిటీ ఖాళీ స్థలంలో ఇతర కట్టడాలను అడ్డుకోవాలని అధికారులకు ఎమ్మార్పీఎస్ నాయకులు వినతి
మార్కాపురం పట్టణంలోని 15వ వార్డు పులసుబ్బయ్య కాలనీలో ఎస్సీలకు కేటాయించిన కమ్యూనిటీ స్థలాన్ని ఇతర కట్టడాలకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మార్పీఎస్ నాయకులు దళిత సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిరసన తెలిపారు. అనంతరం ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు డానియల్ మాట్లాడుతూ ఎస్సీలకు కమ్యూనిటీ స్థలం కేటాయిస్తూ మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఎక్కడ కూడా దళితులు వివిధ కార్యక్రమాలు చేసుకోవడానికి సెంటు స్థలం కూడా లేదన్నారు. మరి దళితులకు కేటాయించిన ఎస్సీ కమ్యూనిటీ ఖాళీ స్థలంలో వివిధ కట్టడాలకు ప్రయత్నిస్తున్నారన్నారు.