కొండపి: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నేరాల నియంత్రణకు నైట్ బీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పోలీసులు, అనుమానిత వ్యక్తులపై నిఘ
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పోలీసులు నేరాలు నియంత్రణకు నైట్ బీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శనివారం తెలిపారు. అపరిచిత వ్యక్తులు లేదా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని స్థానిక ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవల దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నామని ప్రజలు వేసవి సెలవులకు వెళ్తున్న నేపథ్యంలో మీ విలువైన వస్తువులు బ్యాంకు లాకర్లో భద్రపరచుకొని వెళ్లాలని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు.