గిద్దలూరు: కంభం పట్టణంలో పందిటి రాజు అనే వ్యక్తికి చెందిన ఇంటిలో చోరీ, దర్యాప్ చేపట్టిన స్థానిక పోలీసులు
మార్కాపురం జిల్లా కంభం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల సమీపంలో పట్టపగలే చోరీ జరిగింది. పందిటి రాజు అనే వ్యక్తికి చెందిన ఇంటిలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంటిలోకి ప్రవేశించి బీరువా పగలగొట్టి అందులో ఉన్న అర తులంబంగారం, 10 తులాల వెండి, రూ.20 వేలు నగదు దొంగలు అపహరించి తీసుకువెళ్లారు. వెళ్తూ వెళ్తూ ఇంటి గ్యాస్ స్టవ్ ద్వారా గ్యాస్ ను లీకేజ్ చేసి వెళ్ళిపోయారు. విధులకు వెళ్లిన ఇంటి యజమాని తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడ్డారన్న విషయాన్ని గుర్తించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు క్లూస్ టీమ్ ని రంగంలోకి దించి దర్యాప్తు చేస్తున్నారు.