యర్రగొండపాలెం: దోర్నాల మండలం జమ్మి దోర్నాల గ్రామ శివారులోని తీగలేరు కాలవపై గుర్తు తెలియని మృతదేహం లభ్యం
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం జమ్మి దోర్నాల గ్రామ శివారులోని తీగలేరు కాలువపై గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది. స్థానిక రైతుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహం సమీపంలో పురుగుమందు డబ్బా ఉండడంతో ఆత్మహత్యగా భావిస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి వయసు 60 సంవత్సరాల పైగా ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.