కొండపి: సింగరాయకొండ విద్యుత్తు సబ్స్టేషన్ ముందు నిరసనకు దిగిన దామచర్ల కాలనీ ప్రజలు, విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
ప్రకాశం జిల్లా సింగరాయకొండ లోని విద్యుత్తు సబ్ స్టేషన్ ముందు బుధవారం దామచర్ల కాలనీ ప్రజలు నిరసనకు దిగారు. మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం కాలం చెల్లిన విద్యుత్ వైర్ల వల్ల తమ ఇంటిలోని టీవీలు ఫ్రిజ్లు ఫ్యాన్లు కాలిపోతున్నాయని దామచర్ల కాలనీ ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి వారిని సముదాయించడమే కాకుండా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో కాలనీ ప్రజలు నిరసన విరమించారు. అలానే విద్యుత్ స్తంభాలు ఒరిగిన వాటిని సరిచేయాలని తెలిపారు.