కమలాపూర్: కమలాపూర్‌లో ప్రమాదం: ఎదురెదురుగా ఢీకొన్న బైకులు, ముగ్గురికి తీవ్ర గాయాలు
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం బ్రిడ్జి వద్ద జరిగిన బైక్ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంకట్రాజు, యశ్వంత్ మరియు కార్తీక్‌గా గుర్తించారు. 108 సిబ్బంది వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.