గిద్దలూరు: రాచర్ల మండలం జేపి చెరువు గ్రామంలో రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా రాచర్ల మండలం జెపి చెరువు గ్రామ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఎడ్ల జతలతో యజమానులు పోటీలకు హాజరయ్యారు. పోటీలలో విజయం సాధించే ఎడ్ల జతల యజమానులకు నగదు బహుమతులను అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు.