దర్శి: దొనకొండ ఎంపీడీవో కార్యాలయంలో టిడిపి ఇన్చార్జి లక్ష్మీ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం
ప్రకాశం జిల్లా దొనకొండ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు అందజేశారు. సుమారు 49 అర్జీలు వచ్చాయని వాటిలో నాలుగు అర్జీలను వెంటనే పరిష్కరించినట్టు లక్ష్మీ తెలిపారు. మిగిలిన 45 అర్జీలను సంబంధిత అధికారులు పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు.