మార్కాపురం: తనకు పాస్ పుస్తకాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన బాధితురాలు ఈశ్వరమ్మ
కొనకనమిట్ల మండలం మునగపాడు గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ తన పొలానికి పాస్ పుస్తకాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ విజయ సునీత కు వినతి పత్రం అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. తన భూమిని ఇతరులు ఆన్లైన్లో ఎక్కించుకోవాలని తిరుగుతున్నారని గత మూడు సంవత్సరాల నుంచి మండల ఆఫీసు చుట్టూ తిరుగుతున్నానన్నారు. పాస్ పుస్తకాలు ఇవ్వాలని కలెక్టర్ ను విజ్ఞప్తి చేశారు.