యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం సమీపంలోని గ్రామాలలో శిలా శాసనాలను గుర్తించామని తెలిపిన డైరెక్టర్ మునిరత్నం రెడ్డి
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం సమీప గ్రామాలలో ఏడు శిలా శాసనాలను గుర్తించి అచ్చులు తీశామని డైరెక్టర్ మునిరత్నం రెడ్డి తెలిపారు. బోయలపల్లిలో లభ్యమైన శాతవాహనుల కాలం నాటి బ్రహ్మ లేపి ప్రాకృతిక భాషలో ఉన్నట్లు తెలిపారు. మిగతావి తెలుగు కన్నడ భాషలో ఉన్నాయన్నారు. ఇవన్నీ క్రీస్తు శకం రెండు నుండి 16వ శతాబ్దం మధ్య శాతవాహన విజయనగర తూర్పు చాళుక్య రెడ్డి రాజుల కాలం నాటివని వివరించారు.