గిద్దలూరు: కొమరోలు మండలం గోపాలుని పల్లి గ్రామంలో కార్డెన్ సర్చ్ నిర్వహించిన పోలీసులు, రెండు ద్విచక్ర వాహనాలు సీజ్
మార్కాపురం జిల్లా కొమరోలు మండలం గోపాలుని పల్లి గ్రామంలో ఆదివారం స్థానిక పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రామకోటయ్య తెలిపారు. ప్రజలకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు దొంగతనాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలను ప్రజలకు వివరించినట్లు వెల్లడించారు. వాహనం నడిపే వ్యక్తి లైసెన్స్ కలిగి ఉండాలని అలానే హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు.