దర్శి: తాళ్లూరు మండలంలో డీజిల్ పెట్రోల్ కొరతతో పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన వాహనదారులు
Darsi, Prakasam | Apr 25, 2026 ప్రకాశం జిల్లాలో మళ్లీ యుద్ధం ఎఫెక్ట్ మొదలైందా.. తాళ్లూరు మండలంలోని పెట్రోల్ బంకుల్లో డీజిల్ దొరకక వాహనదారులు శనివారం బంకులవద్ద బారులు తీరారు. డీజిల్ కొరత ఉందని బంకుల యాజమానులు చెబుతున్నారని వాహనదారులు అన్నారు. పెట్రోల్ రేట్లు పెరుగుతాయనే భయంతో ఇలా ముందుగానే బంకులపై పడుతున్నారని.. దీంతో కొరత ఏర్పడుతోందనేది మరికొందరి వాదన. తూర్పు గంగవరంలో రైతులు క్యాన్లతో బంకుల వద్ద క్యూ కట్టిన దృశ్యాలు దర్శనమిచ్చాయి.