యర్రగొండపాలెం: దోర్నాల మండలంలో టోల్ ప్లాజా పేరు వివాదంపై హైకోర్టు స్టే విధించిందని తెలిపిన హసనాబాద్ గ్రామస్తులు
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం లో టోల్ ప్లాజా పేరు వివాదంపై హైకోర్టు స్టే విధించిందని హసనాబాద్ గ్రామస్తులు తెలిపారు. కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై నిర్మిస్తున్న టోల్ ప్లాజా కు హసనాబాద్ పేరు పెట్టకుండా జమ్మి దోర్నాల పేరు పెట్టడంతో గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు రెండు వారాలలో వివాదం పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో హసనాబాద్ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.