మార్కాపురం: జిల్లా కేంద్రంలో జరుగుతున్న హనుమాన్ శోభాయాత్ర విజయవంతం చేయాలని గ్రామాలలో బీజేపీ ప్రచారం
మార్కాపురం జిల్లా మార్కాపురం మండలంలోని గ్రామాలలో హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమం పై బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి కృష్ణారావు అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా మే 12వ తేదీ జిల్లా కేంద్రంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో శోభయాత్ర కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ భక్తులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.