మార్కాపురం: పెద్ద యాచవరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం మండలం పెద్ద యాచవరం గ్రామంలో నూతనంగా 32 లక్షల రూపాయలతో నిర్మించిన పంచాయతీ కార్యాలయం మరియు బోడపాడు పెద్ద యాచవరం గ్రామాల మధ్య కోటి 50 లక్షలు రూపాయలతో ఏర్పాటుచేసిన తారు రోడ్డును ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సమక్షంలో 20 వైసీపీ కుటుంబాలు టిడిపి పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ గ్రామం తన సొంత గ్రామం లాంటిదని గత టిడిపి ప్రభుత్వంలోనే కొన్ని కోట్ల రూపాయలతో సిసి రోడ్లు ఏర్పాటు చేశామన్నారు.