గిద్దలూరు: అర్ధవీడు మండలం పాపినేనిపల్లిలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం వల్ల 30 ఎకరాలలో కాలిపోయిన మొక్కజొన్న పంట
మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం పాపినేనిపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. మొక్కజొన్న పంటకు ని పట్టుకొని 30 ఎకరాలలో పంట కాలిపోయింది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు వేసి ఉండవచ్చని స్థానిక రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపు పంట మొత్తం కాలిపోయింది. దాదాపు రూ.30 లక్షల వరకు ఆర్థికంగా నష్టపోయినట్లుగా పంట వేసిన రైతులు తెలిపారు. సుమారు 8 మంది రైతులు అగ్నిప్రమాదంలో ఆర్థికంగా నష్టపోయినట్లుగా తెలుస్తోంది. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.