వలిగొండ పట్టణ కేంద్రంలో సోమవారం తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాలుగవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని మండల కన్వీనర్ రాపోలు పవన్ కుమార్ ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు కావలి యాదయ్య మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులందరూ ఏకమై 2010 అక్టోబర్ 9న గద్దర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ టిపిఎఫ్ ఏర్పడిందని అన్నారు. ఈనెల 29, 30 తేదీల్లో హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు.