మార్కాపురం: జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో యోగాంధ్ర కార్యక్రమంలో ఆకట్టుకున్న చిన్నారులు
మార్కాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి జిల్లా కలెక్టర్ విజయ సునీత పాల్గొన్నారు. వర్షం కారణంగా గ్రౌండ్లో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన కార్యక్రమం నిలిచిపోయింది. దీంతో పాఠశాల లైబ్రరీ హాల్లో చిన్నారులు యోగాసనాలు వేసి ఎంతగానో అలరించారు. ఆసనాల ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రదర్శించారు