కొండపి: మంత్రి స్వామిని కలిసిన పి డి సి సి బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య
టంగుటూరు తూర్పు నాయుడుపాలెంలో మంత్రి బాల వీరాంజనేయ స్వామిని నూతన పీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ కామేపల్లి సీతారామయ్య సోమవారం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన నియామకానికి సహకరించినందుకు మంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని మంత్రికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.